సాధారణంగా స్టార్ హీరోల రెమ్యూనిరేషన్ కు సంబంధించిన విషయం ఎప్పుడైనా సరే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ హీరోల పారితోషం గురించి తెలుసుకునేందుకు ప్రేక్షకులందరూ ఆసక్తి చూపుతూనే ఉంటారు అని చెప్పాలి. ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ పారితోషకంకు  సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. గత కొంతకాలం నుంచి హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రవితేజ. ముఖ్యంగా సీనియర్ దర్శకులతో సినిమాలు చేయడం కాదు ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త దర్శకులతోనే సినిమాలు చేస్తూ పోతున్నాడు.


 కొన్నిసార్లు రవితేజ చేసే ప్రయోగాలు సక్సెస్ అవుతూ ఉంటే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఇక నిరాశ ఎదురవుతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల  నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా శ్రీ లీల  హీరోయిన్గా తెరకెక్కిన మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమా ధమాకా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే థియేటర్లలో దుమ్ము రేపుతూ భారీ వసూళ్లు సాధిస్తుంది ఈ సినిమా. ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల్లో మరో సినిమాతో రవితేజ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అయితే హీరోగా కాదు ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.


 మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు రవితేజ. అయితే ఈ సినిమాలో గెస్ట్ పాత్ర కోసం రవితేజ ఎంత రెమ్యూనరేషన్  తీసుకున్నాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి. ఇక ఆ విషయం తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఏకంగా గెస్ట్ రోల్ కోసం రవితేజ దాదాపు 17 కోట్ల రూపాయలు పారితోషకం అందుకున్నాడట. ఈ విషయం తెలిసి ఎంతో మంది ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. అంటే ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు రేంజ్ లోనే రవితేజ కూడా గెస్ట్ రోల్ కోసం ఛార్జ్ చేస్తున్నాడు అన్నది తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల ధమాకా విజయం అటు వాల్తేరు వీరయ్య సినిమాకు ప్లస్ కాబోతుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: