ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని రీతిలో సందడి నెలకొనబోతుంది అన్న విషయం తెలిసిందే. మెగా నందమూరి హీరోల మధ్య మరోసారి టఫ్ ఫైట్ జరగబోతుంది. ఏకంగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ఈ రెండు కూడా పక్కా మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.


 అయితే ఇక ఈ రెండు సినిమాలు కూడా ఈ సంక్రాంతికి సూపర్ హిట్ లో సాధిస్తాయని అభిమానులు కూడా ఎంతో ధీమాగా ఉన్నారు అని చెప్పాలి. అంతేకాదు ఇక రెండు సినిమాలకు కూడా నిర్మాణ సంస్థగా వ్యవహరించింది movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు కావడం గమనార్హం. అయితే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అంటే చాలు ఇటీవల కాలంలో హిట్ మూవీ అనే విధంగా ప్రేక్షకుల్లో ఒక భావన ఏర్పడింది. దీంతో రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయని అనుకుంటున్నారు. ఇక ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలలో ఒక సినిమా హిట్ అయి మరో సినిమా ఫ్లాప్ అయినా కూడా కచ్చితంగా నిర్మాణ సంస్థకు నష్టాలు మాత్రం తప్పవు అని చెప్పాలి.



 అదే సమయంలో ఇక ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతున్న నేపథంలో ఇక ఈ సినిమాల్లోని ఒక్కో అంశాన్ని కంపేర్ చేస్తూ సినీ విశ్లేషకులు అభిమానులు సోషల్ మీడియాలో సరికొత్తగా చర్చించుకుంటూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే లుక్స్ పరంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి మాస్ లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక బాలకృష్ణ లుక్స్ విషయానికి వస్తే గత సినిమాల్లో లాగానే రొటీన్ లుక్స్ తో కనిపిస్తూ ఉంది అన్న టాక్. ఇలా లుక్స్ పరంగా మాత్రం బాలయ్య పై చిరంజీవి పై చేయి సాధించినట్లే అని కొంతమంది సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారట. మరి సినిమా కథ, కథనం పరంగా ఎవరు విజయం సాధించి పై చేయి సాధిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: