టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజ కి ఎంతటి ఫాలోయింగ్ ఉందొ మనందరికీ తెలిసిందే. రవితేజ సినిమా వస్తుంది అంటే చాలు ఆయన అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు సైతం ఆయన సినిమా చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే గత కొన్నాళ్లుగా రవితేజ కి సరైన హిట్ సినిమా దొరకడం లేదు. గతంలో ఆయన నటించిన టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా, నేల టికెట్టు సినిమాలు ఎంతటి ఫ్లాప్ ను అందుకున్నాయో మనందరికీ తెలిసిందే. ఇక దాని అనంతరం 20201 లో విడుదలైన క్రాక్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు రవితేజ.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ స్థాయిలో రికార్డును సృష్టించింది.దాని అనంతరం రవితేజ నటించిన కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో రవితేజ కి మళ్ళీ హిట్ సినిమా పడాలి అని ఆయన అభిమానులు ఎంతో ఎదురుచూశారు.తాజాగా డిసెంబర్ 23న మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా విడుదల ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విడుదలై ఇన్ని రోజులు అయినప్పటికీ భారీ వసూళ్లను సాధిస్తుంది ఈ సినిమా.

అయితే ఈ రెండు సినిమాల సక్సెస్ కు ఒక కారణం ఉంది అని తెలుస్తుంది. కాదేంటంటే క్రాక్, ధమాకా ఈ రెండు సినిమాల్లోనూ బిబిఎస్ రవి ఒక పాత్రను పోషించడం జరిగింది.రవితేజ నటించే సినిమాల్లో ఈయన ఏదో ఒక పాత్రలో కనిపిస్తూ ఉన్నాడు. ఇక ఆయన నటించిన ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ను అందుకోవడంతో ఈయన వల్లే రవితేజ కి ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నయని ఈయన వల్ల రవితేజ కలిసి వచ్చింది కామెంట్లు వస్తున్నాయి. ఈ సినిమా దర్శకుడు అయిన త్రినాధ రావు నక్కిన కంటే ఈ ఫ్లాగ్ దర్శకుడికే ఈ సినిమాల ద్వారా మంచి గుర్తింపు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: