నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.సాధారణంగా ఫ్లో లో  ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు బాలకృష్ణ. అప్పుడప్పుడు బాలయ్య ఏం మాట్లాడతాడో కూడా ఎవరికీ సరిగ్గా అర్థం కాదు. గతంలో ఎన్నోసార్లు నోరు జారి అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. బాలయ్య చాలా సందర్భాల్లో ఆయన నోరు జారీ చేసిన వ్యాఖ్యలకి గాను క్షమాపణలు కూడా చెప్పాడు.తాజాగా  వీరసింహారెడ్డి సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ లో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆ రంగారావు ఈ రంగారావు ఈ అక్కినేని తొక్కినేని అంటూ నోరు జారాడు బాలయ్య. 

దీంతో నందమూరి బాలకృష్ణ  పై ఒక రేంజ్ లో మండిపడుతున్నాడు అక్కినేని అభిమానులు.అక్కినేనికి కుటుంబాన్ని  అవమానించాడు అంటూ బాలయ్య పై విరుచుకుపడుతున్నారు. ఇటీవల అక్కినేని ఫ్యామిలీ కూడా బాలయ్య వ్యాఖ్యలపై సీరియస్ గా రియాక్ట్ అవ్వడం మనం చూసాం. అయితే తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు.. ఇందులో భాగంగానే బాలకృష్ణ మాట్లాడుతూ.. తను కావాలని ఇలా మాట్లాడలేదు అని ఏ అన్నారంటే తనకు చాలా గౌరవమని.. నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటే అది నా బాధ్యత కాదు అని.. చెప్పుకొచ్చాడు. 

అంతేగాని ఎక్కడ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకి క్షమాపణలు కోరలేదు నందమూరి బాలకృష్ణ . నేను అసలు తప్పుగా మాట్లాడలేదు అంటూ వాదిస్తున్నాడు బాలయ్య. దీంతో బాలయ్య పై ఇంకా కోపంగానే ఉన్నాడు నాగార్జున. ఇందులో భాగంగానే ఈ విషయంపై నాగార్జున ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా బాలకృష్ణసినిమా చేయాలి అన్నా సరే అన్నపూర్ణ స్టూడియోస్ లో చేస్తారు. ఇందులో భాగంగానే నాగర్జున అన్నపూర్ణ స్టూడియోస్ లో బాలయ్యకి పర్మిషన్ ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నపూర్ణ స్టూడియోస్ లోకి బాలయ్యకి ఎంట్రీ ఇవ్వకూడదని భావిస్తున్నాడు నాగార్జున..!!

మరింత సమాచారం తెలుసుకోండి: