
తమిళనాడులో మాత్రం దసరా సినిమా హక్కులు అమ్ముడుపోలేదు. కర్ణాటకలో కె ఆర్ జి, కేరళలో ఈ ఫోర్ ఈ, ఓవర్సీస్ ఫార్స్ ఇలా పలుచోట్ల ప్రతిచోట అగ్ర పంపిణీదారులు సినిమా హక్కులను కొనుగోలు చేశారు. కానీ ఒక తమిళనాడులో ఇప్పటివరకు ఎవరు కూడా సినిమాను కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. మరోపక్క తెలుగు, తమిళ్ అనే వివక్షత ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఈ వివాదం మరింత చెలరేగేటట్టు కనిపిస్తోంది. అయితే నానిని ఎందుకు టార్గెట్ చేశారు అనేది మాత్రం తెలియడం లేదు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుమారుగా రూ. 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఏ సినిమాను ఇప్పుడు ఇలా తమిళ్ పంపిణీ దారులు కొనుగోలు చేయకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది మరోపక్క ఇందులో తమిళ డైరెక్టర్ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని కూడా భాగమయ్యారు.
అన్ని భాషలలో ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు మాత్రం తమిళనాడులో సినిమా హక్కులను కొనుగోలు చేయకపోవడంతో భారీగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా గత మూడు రోజుల క్రితం టీజర్ ని కూడా హిందీ, తమిళ్ , మలయాళం, కన్నడ, తెలుగులో కూడా విడుదల చేశారు. టీజర్ కూడా అన్నిచోట్ల బాగా మంచి రెస్పాన్స్ అందుకుంది మరి ఇలాంటి సమయంలో ఎందుకు సినిమా హక్కులను కొనుగోలు చేయలేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది.