
విభిన్నమైన కథనాలతో సూపర్ హిట్ కొట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరుచుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు సందీప్ కిషన్. ఈసారి బలంగా కొట్టాలని ఉద్దేశంతో పాన్ ఇండియా లెవెల్లో మైఖేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాతో నైనా సందీప్ కిషన్ హిట్ కొట్టాడా లేదా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మైఖేల్ సినిమా కథ విషయానికి వస్తే..మైఖేల్ అనే కుర్రాడు తన చిన్న వయసు నుండి పెద్ద గ్యాంగ్ స్టార్ కావాలని కలలు కంటూ ఉంటారు ఆ లక్ష్యంతోనే పెద్దయ్యాక కూడా ఒక గ్యాంగులో చేరడం జరుగుతుంది. ఆ గ్యాంగులో ఇతని పనిని బట్టి అంచలంచెలుగా తాను కోరుకున్న స్థానంలో వెళుతూ ఉన్న సమయంలోనే తీరా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ అమ్మాయితో ప్రేమలో పడి మైఖేల్ జీవితం లోని మార్పులు ఏంటి అన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
క్రైమ్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు చూడడానికి ఇష్టపడుతున్నారు.. కానీ రొటీన్ గా అనిపిస్తే మాత్రం ఫలితం తేడా వస్తుందని చెప్పవచ్చు. విడుదలకు ముందే ట్రైలర్లు ఈ సినిమా కథపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక డైరెక్టర్ రంజిత్ జయకోడి.. సినిమా ప్రారంభం నుండి కథలోకి అడుగుపెట్టి ఆసక్తికరంగా సాగించారు. ఇంటర్వెల్ కాస్త బోర్ గా అనిపించిన సెకండ్ పార్ట్ లో టెక్నికల్‌గా ఎంతో అద్భుతంగా కనిపించింది. క్రైమ్ యాక్షన్ డ్రామా గా ఈ సినిమానీ చూడవచ్చుట