బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియార అద్వానీ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే.. ఎట్టకేలకు ఈనెల 6వ తేదీన జైస్మలేరులో వీరు వివాహం చేసుకోబోతున్నారు. నిన్నటి రోజు నుంచే మూడు రోజులపాటు ఈ పెళ్లి సంబరాలు చాలా వైభవంగా కొనసాగుతున్నాయి. వీరి పెళ్లిలో మొబైల్ కి కూడా అనుమతి లేదట. ఆ మేరకు ఒక కొత్త పాలసీని ఖాయం చేసినట్లు తెలుస్తోంది. అతిథులను ఇప్పటికే ఫోటోలు పోస్ట్ చేయవద్దని కూడా తెలియజేసినట్లు సమాచారం.ఇప్పటికే పెళ్లి వేడుకల పాల్గొన్న అతిథులతో హోటల్ చాలా కళకళలాడుతున్నట్లుగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇంతకుముందు పెళ్లి సమయంలో కత్రినా, విక్కీ కౌశల్ జంట కూడా ఇలాగే అతిథులను అభ్యర్థించారు. ఇక అలాగే కియారా,సిద్ధార్థ్ మల్హోత్రా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది ఈ పెళ్లి అతి కొద్దిమంది బంధుమిత్రుల కుటుంబ సభ్యులతో జరగబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు కరోనా సమస్య లేదు కాబట్టి కొంత మంది సెలబ్రిటీలను కూడా ఈ పెళ్లికి హాజరయ్యే విధంగా ఆస్కారం ఉన్నట్లు సమాచారం.
వీరి పెళ్లికి కరన్ జోహార్, అశ్విని మారుతి తదితర సన్నిహితులతో పాటు వరుణ్ ధావన్, కత్రీన , విక్కీ కౌశల్,రకుల్, జాకీ, తదితరులు ఈ పెళ్లికి హాజరు కాబోతున్నట్లు సమాచారం ఈ జంట పెళ్లికి ముందు సంగీత్ మెహందీ హల్దీ వేడుకలు కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు. ఫిబ్రవరి 4, 5వ తేదీలలో జరిగినట్లు తెలుస్తోంది ఫిబ్రవరి 6వ తేదీన ఈ జంట పెళ్లి ప్రయాణం చేయబోతున్నారు.సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా ఇరువురు బంధువుల కోసం రెండు భారీ రిసెప్షన్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది వీటిలో ఒకటి ముంబైలో వారి పరిశ్రమ స్నేహితుల కోసం మరొకటి ఢిల్లీలో వరుడు కుటుంబాల కోసం ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. ఇక వీరి పెళ్లికి సంబంధించి ఫోటోలు వీడియోల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: