తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన ముద్దు గుమ్మలలో ఒకరు అయినటువంటి సదా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జయం మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల ... విమర్శకుల ప్రశంసలను అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సినిమా అవకాశాలను దక్కించుకుంది. 

అలాగే సదా తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీ లో కూడా అనేక మూవీ ల అవకాశాలను దక్కించుకొని ఎన్నో సంవత్సరాల పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సదా వరస పెట్టి సినిమాల్లో నటించకపోయినప్పటికీ అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే టీవీ షో లను జడ్జిగా వ్యవహరిస్తూ కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. ఇలా ప్రస్తుతం సినిమాలతో ... టీవీ షో లతో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. సదా తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని క్యూట్ స్మైల్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సదా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: