నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. బాలకృష్ణ వరుసగా అఖండ ... వీర సింహా రెడ్డి మూవీ ల విజయాలతో అదిరిపోయే ఫామ్ లో ఉన్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన వీర సింహా రెడ్డి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను అందుకుంది. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురి పాత్రలో శ్రీ లీల కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందబోటుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు టైటిల్ ను ఈ సినిమా బృందం ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ బాలయ్య కెరియర్ లో 108 వ మూవీ గా తెరకెక్కుతూ ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ను ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తుంది.

ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ కు సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ షూటింగ్ ఈ నెల మూడవ వారం నుండి ప్రారంభం కాబోతున్నట్లు ... ఈ షెడ్యూల్ లో ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్న తారాగణంపై కీలక సన్నివేశాలను ఈ మూవీ యూనిట్ చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: