
సమాజ్వాది పార్టీ నేత అయిన ఫహద్ అహ్మదును బాలీవుడ్ నటి స్వర భాస్కర్ పెళ్లాడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక కొంతమంది అభిమానులు వీరిద్దరికీ కంగ్రాట్యులేషన్స్ చెబుతూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం స్వర భాస్కర్ పహాడ్ అహ్మద్ ను పెళ్లి చేసుకున్నందుకు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సినీ సెలబ్రిటీలు మాట్లాడేది ఒకటి చేసేది మరొకటి అన్న విషయాన్ని స్వర భాస్కర్ నిరూపించింది అంటూ కొంతమంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత స్వర భాస్కర్ ఈ రేంజ్ లో ట్రోల్స్ ఎదుర్కోవడానికి పెద్ద కారణమే ఉంది.
ఒకప్పుడు అన్నయ్య అని ఎంతో ప్రేమగా పిలిచిన వ్యక్తినే ఇక ఇప్పుడు స్వర భాస్కర్ పెళ్లి చేసుకుని భర్తగా స్వీకరించింది అని చెప్పాలి. 2020లో సమాజ్వాది పార్టీ తరఫున స్వర భాస్కర్ ప్రచారం నిర్వహించింది అన్న విషయం అందరికీ తెలుసు. ఇక ఆ సమయంలో ఆ పార్టీ నేత అయిన ఫహద్ ను అన్నయ్య అని ఆమె ప్రేమగా పిలిచేవారు. ఇక ఫహద్ పుట్టినరోజు నాడు కూడా బాయ్ అంటూ సంబోధిస్తూనే సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది స్వర భాస్కర్. ఇలా అన్నయ్య అని పిలిచిన వ్యక్తిని ఇక ఇప్పుడు పెళ్లి పెళ్లి చేసుకుంది.ఇక ఈ విషయం తెలిసిన తర్వాత అన్నయ్య అని పిలిచి పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజెన్స్.