ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. ఇతను చేసిన సినిమాల్లో కేవలం ఎస్ఆర్ కళ్యాణమండపం మాత్రమే పర్వాలేదనిపిస్తుంది. అది కూడా పాటలు వల్ల బాగుంది. మిగతా వన్నీ ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా తెలీదు. కానీ ప్రమోషన్స్ మాత్రం బాహుబలి రేంజిలో చేస్తాడని ఈ హీరోని ట్రోల్ చేస్తారు నెటిజన్స్. ఇక సమ్మతమే సినిమా కరోనా టైంలో వచ్చింది. తక్కువ ఆక్యుపెన్సీతోనే ఈ సినిమా మీద కూడా విపరీతమైన నెగటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.కానీ కలెక్షన్ల పరంగా ఈ సినిమా సూపర్ హిట్ అని మేకర్లు చెబుతుంటారు.తాజాగా కిరణ్ అబ్బవరం తన మీద, తన సినిమాల మీద జరిగే భారీ ట్రోలింగ్‌పై రియాక్ట్ అయ్యాడు. వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో మీడియాతో ముచ్చటించింది చిత్రయూనిట్.


ఇక ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఎవరో ఊరు పేరు తెలియని వారంతా కూడా తన సినిమా గురించి సోషల్ మీడియాలో నెగెటివిటి స్ప్రెడ్ చేస్తారంటూ మండి పడ్డాడు.సమ్మతమే సినిమాను కూడా అట్టర్ ఫ్లాప్ అని అన్నారు.. ఆ సినిమాకు మొత్తం మూడు కోట్లు పెట్టాం.. అన్నీ కలిపి సినిమాకి పన్నెండు కోట్లు వచ్చాయి.. అంత వచ్చినా కూడా సినిమాని ఫ్లాప్ అని అంటే ఎలా.. తెలియకుండా లెక్కల గురించి మాట్లాడొద్దు అని కిరణ్ అబ్బవరం నెటిజన్స్ పై ఫైర్ అయ్యాడు.ఇక వినరో భాగ్యము విష్ణు కథ అయితే చాలా మంచి సినిమా అని, మంచి మాటలు చెప్పామని ఇంకా దేశం గురించి చెప్పామని అలాగే పిల్లలకు ఎలాంటి మాటలు చెప్పాలో, ఎలా పెంచాలో చక్కగా చూపించామని.. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని అందరూ చూడండి అని కిరణ్ అబ్బవరం చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: