సమంత హీరోయిన్ గా విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. ఈ చిత్రాన్ని నిన్ను కోరి, మజిలీ ఫేమ్ డైరెక్టర్ శివా నిర్మాణదర్శకత్వం లో తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడటంతో కాస్త విరామం జరిగింది. అయితే ఇప్పుడు సమంత ఫుల్ ఫిట్గా తయారయ్యి మళ్ళీ షూటింగ్లకు పాల్గొనేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వీడియోలు చూస్తుంటే సమంత కచ్చితంగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది.


అలాగే హాలీవుడ్లో సీటాడేల్ అని ఒక కొత్త వెబ్ సిరీస్ లో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక విజయ్  అభిమానులు కూడా ఖుషి సినిమా అప్డేట్ ఎప్పుడు అంటూ చాలా ఆతృతంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ చేయవలసిన కొన్ని ఎపిసోడ్లను ఈనెల 27 28వ తేదీన షూట్ చేయబోతున్నట్లుగా సమాచారంఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి ప్రధాన షెడ్యూల్ వచ్చే నెల 8వ తేదీన ప్రారంభించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ సినిమాని విశాఖపట్నం తో పాటు కేరళ అలపిలో షూటింగ్ జరగబోతున్నట్లు సమాచారం. వేసవికాలం అంతా షూటింగ్ జరిపి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే మిగిలి ఉన్న పూర్తి సినిమాను కూడా రెండు ప్రాంతాలలో పూర్తి చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సమంత కారణంగా ఎన్నోసార్లు ఖుషి సినిమా షెడ్యూల్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఈసారి కచ్చితంగా షూటింగ్ కి పాల్గొనబోతోంది సమంత అని చెప్పడంతో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ను చిత్ర బృంద ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈసారి షూటింగ్ పూర్తి చేసుకుని ఖుషి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వరకు వెళుతుందేమో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: