హరీష్ శంకర్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా మొదట పూజా హెగ్డే పేరు వినిపించిందనే విషయం తెలిసిందే.

సినిమా లో పూజా హెగ్డేను హీరోయిన్ గా ప్రకటించే సమయానికి ఆమె వరుస ఆఫర్ల తో బిజీ బిజీగా ఉన్నారు. అయితే తర్వాత రోజుల్లో పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయనే విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్డేకు క్రేజ్ కూడా బాగా తగ్గింది. పూజా హెగ్డే యాక్టింగ్ స్కిల్స్ పై కూడా చాలామంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే పూజా హెగ్డేకు దిమ్మతిరిగే షాకిస్తూ శ్రీలీల మరో ఆఫర్ ను కూడా అందుకుంది. హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ ను ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు సమాచారం అందుతోంది.

పూజా హెగ్డే తన కు బదులు గా శ్రీలీల ఎంపికైన నేపథ్యంలో ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతారో మరి చూడాలి. వినోదాయ సిత్తం రీమేక్ లో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కు జోడీగా శ్రీలీల అనే సంగతి తెలిసి ఫ్యాన్స్ కూడా ఎంతగా నో సంతోషిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల క్రేజీ హీరోయిన్ గా నిలిచారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం విశేషం.. వరుస గా టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా అవకశాలను అందుకుంటూ శ్రీలీల వార్తల్లో నిలుస్తున్నారు. శ్రీలీల డ్యాన్స్ లు కూడా అద్భుతంగా చేస్తుండటంతో ఆమెకు మూవీ ఆఫర్లు పెరుగుతున్నాయని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. శ్రీలీల పారితోషికం బాగా పెరుగుతోంది. శ్రీలీల రాబోయే రోజుల్లో నంబర్ వన్ హీరోయిన్ గా నిలిచే అవకాశం అయితే ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: