కోలీవుడ్ క్యూట్ కపుల్ అయిన సిద్ధార్థ్ మరియు అదితి రావ్ హైదరీ. ఈ ఇరువురి స్టార్స్ మధ్య ఏదో జరుగుతోందని చాలా రోజులు గా అయితే వార్తలు వచ్చాయి.

ఈ వార్తలు ఇక ఏమాత్రం కూడా పుకార్లు కావు. వీళ్లు పరోక్షంగా తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ను బయట పెట్టేస్తున్నారని తెలుస్తుంది.ఈ మధ్యే ఈ జంట లంచ్ డేట్ కు కూడా వెళ్లగా.. తాజా గా ఓ పాపులర్ పాటకు కలిసి బాగా స్టెప్పులేశారు.

ఇన్‌స్టా రీల్స్ కోసం సిద్ధార్థ్ మరియు అదితి ఇలా డ్యాన్స్ చేయడం గమనార్హం.అదితి ఇంట్లోనే వీళ్లు ఇలా మైమరచిపోయి స్టెప్పులేశారని తెలుస్తుంది.తమిళ పాపులర్ సాంగ్ టమ్ టమ్ పాటకు వీళ్లు డ్యాన్స్ చేశారటా. విశాల్ నటించిన ఎనిమీ మూవీలోని సాంగ్ అని తెలుస్తుంది.తమిళంతోపాటు తెలుగులో నూ ఈ సాంగ్ మ్యూజిక్ మంచి టాక్ ను కొట్టేసింది. ఇప్పుడు తాను సిద్ధార్థ్ తో కలిసి చేసిన ఈ డ్యాన్స్ వీడియోను అదితి పోస్ట్ చేసింది..

డ్యాన్స్ మంకీస్  ద రీల్ డీల్ అనే క్యాప్షన్ తో అదితి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.వీడియో చాలా క్యూట్ గా ఉంది అంటూ చాలా మంది హార్ట్ ఎమోజీల తో అయితే కామెంట్స్ చేశారు. ఈ మంకీలు చాలా క్యూట్ గా ఉన్నాయి అంటూ కూడా సోఫీ చౌదరి కూడా ఒక కామెంట్ చేయడం విశేషం.

ఇక వీళ్ల సినిమాల విషయాని కి వస్తే అదితి నటించిన తాజ్ మూవీ త్వరలోనే జీ5 ఓటీటీలోకి రాబోతోందని సమాచారం.. ఇక మరో మూవీ హీరామండి కూడా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుందని తెలుస్తుంది.. మరోవైపు సిద్ధార్థ్ చివరిసారి అదితితో కలిసి మహాసముద్రం మూవీ లో నటించగా.. ఇప్పుడు కమల్ హాసన్ తో కలిసి ఇండియన్ 2లో నటిస్తున్నాడటా.

మరింత సమాచారం తెలుసుకోండి: