
ఇదంతా ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా అయిపోయిన వెంటనే.. ఏ ఏ సినిమాలలో చేయబోతున్నారని విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక చిత్రం.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా తో ఒక చిత్రం ఏ.ఆర్ మురగదాసుతో కూడా మరొక చిత్రాల్లో నటించబోతున్నారు. ఇవన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోని ఈ సినిమా ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ ప్రమోషన్ లైన్ అఫ్ అదిరిపోయేలా ఉందంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
మరి అల్లు అర్జున్ అన్ని పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం పుష్ప-2 సినిమాని షూటింగ్ మొదలుపెట్టి ఫినిష్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అభిమానులు మాత్రం ఈ చిత్రానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వాలని పలు రకాలుగా ధర్నాలు కూడా చేయడం జరిగింది. మరి అభిమానుల కోరిక మేరకు ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ విడుదల చేస్తారేమో చూడాలి మరి.