తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొరటాల శివ ... రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క ... రీచా గంగోపాధ్యాయ హీరోయిన్ లుగా రూపొందినటు వంటి మిర్చి మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోని సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత శ్రీ మంతుడు ... జనతా గ్యారేజ్ ... భరత్ అనే నేను మూవీ లతో వరుస బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా మారిపోయాడు.

ఇది ఇలా ఉంటే  కొరటాల శివ ఆకరుగా మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య అనే మూవీ ని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇలా ఆచార్య మూవీ తో ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచిన కొరటాల శివ తన తదుపరి మూవీ ని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ 30 వ మూవీ కోసం కొరటాల శివ అదిరిపోయే కాస్ట్ అండ్ క్రూను సిద్ధం చేస్తున్నాడు.

అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ కి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. అలాగే ఈ సినిమా లోని యాక్షన్స్ సన్నివేషాల కోసం హాలీవుడ్ కొరియోగ్రాఫర్ లు పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా కొరటాల శివమూవీ కోసం అత్యద్భుతమైన క్యాస్ట్ అండ్ క్రూ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: