
దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా విడుదల తేదీ గురించి తెలియజేస్తూ..RC -15 గురించి కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ సినిమా టైటిల్ ని ఉగాది లేదా రామ్ చరణ్ పుట్టినరోజున రివిల్ చేస్తామని తెలియజేశారు. 2024 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయడానికి ఎక్కువగా సలహాలు చేస్తున్నామని తెలియజేశారు. ఇక ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టుకే సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది ఈ లెక్క ప్రకారం 2024 సంక్రాంతి పోరు చాలా రసవత్తంగా ఉంటుంది అని తెలిపారు.
RC -15 చిత్రం అధికారికంగా సిటిజన్ సర్కారోడు అంటే టైటిల్ ని పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి అయితే ఇప్పుడు CEO అనే మరొక టైటిల్ని తెరమీదకి తీసుకురావడం జరుగుతోంది ఈ టైటిల్ దాదాపుగా ఖరారు అయినట్టుగా అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు టైటిల్ తెలియాలి అంటే మార్చి 27 వరకు ఆగాల్సిందే అని చెప్పవచ్చు. రామ్ చరణ్ ఏడాది ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయంతో చాలా సంబరపడిపోతున్నారు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా తెగ సంబరపడుతున్నారు. మరి రామ్ చరణ్ తన తదుపరి చిత్రాలను మరింత సక్సెస్ఫుల్గా ముందుకు సాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.