మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇలా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోbగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

 కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో అంజలి ... సునీల్ ... శ్రీకాంత్ ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీ లో విలన్ పాత్రలో ఎస్ జే సూర్య కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమా టైటిల్ ను ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.

మూవీ కి "సీ ఈ వో" అనే టైటిల్ ను ఇప్పటికే ఈ చిత్ర బృందం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా కోసం శంషాబాద్ దగ్గర భారీ  స్టేడియం సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్టేడియం సెట్ లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా లోని అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: