తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుల్లో ఒకరు అయినటు వంటి సుశాంత్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాళిదాసు మూవీ తో వెండి తెరకు పరిచయం ఆయన ఈ హీరో హీరో ఆ తర్వాత చాలా సినిమాలలో హీరో గా నటించి తన కెరీర్ లో ఎన్నో మంచి విజయాలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఇది ఇలా ఉంటే సుశాంత్ హీరోగా రూపొందిన "చి లా సౌ" మూవీ అద్భుతమైన విజయం అందుకోవడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ లోని సుశాంత్ నటనకు గాను అద్భుతమైన ప్రశంశాలు కూడా ఈ యువ హీరోకు దక్కాయి. ఇది ఇలా ఉంటే హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న సుశాంత్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఇతర ముఖ్య పాత్రలలో కూడా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే అలా వైకుంఠపురంలో ఒక కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం భోళా శంకర్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా రావణాసుర అనే మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 7 వ తేదీన విడుదల కానుంది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ కి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు.  తాజాగా సుశాంత్ రావణాసుర మూవీ గురించి మాట్లాడుతూ ... రావణాసుర మూవీ చాలా ఉత్తేజ కరమైన థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ లో చాలా కొత్త ఎలిమెంట్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అలాగే నా క్యారెక్టర్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు అని సుశాంత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: