ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా సమంతకి ఎలాంటి స్టేటస్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గతంలో సమంత అగ్ర హీరోలతో పాటు చిన్న హీరోల సినిమాల్లో కూడా నటించింది. కానీ ఇప్పుడు ఆమె రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. అయితే గతంలో ఓ దర్శకుడి సినిమాలో నటించడానికి సమంత అస్సలు ఒప్పుకోలేదట. ఇక ఆ పూర్తి వివరాలకు వెళితే.. దర్శకుడు అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన 'ఆర్ఎక్స్ 100' సినిమా అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ముఖ్యంగా యువతను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. యంగ్ హీరో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ సినిమాతోనే అజయ్ భూపతి దర్శకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. 

ఇక ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మహాసముద్రం అనే సినిమాను తెరకెక్కించాడు అజయ్. అయితే ఈ సినిమాకి ముందుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా అనుకున్నారట. అదే సమయంలో హీరోయిన్గా సమంతను పెట్టుకుందామని భావించి స్వయంగా సమంతకి ఈ విషయం చెప్పారట. కానీ సమంత మాత్రం ఒప్పుకోలేదు సరి కదా, నేను తీసుకునే రెమ్యునరేషన్ కి మూడింతలు ఎక్కువ ఇచ్చినా నేను ఈ సినిమాలో నటించనని ఖరాకండిగా చెప్పిందట. అయితే సమంత బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయను అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఆ సమయంలో సమంత రేంజ్ పెరగడమే. అంతేకాదు ఆ టైంలో సాయి శ్రీనివాస్ కి సమంతకి ఉన్న క్రేజ్ లేదు.

అప్పటికే సాయి శ్రీనివాస్ తో అల్లుడు శీను సినిమాలో నటించింది సమంత. ఇక మళ్లీ అదే హీరోతో నటించడం ఇష్టం లేక నో చెప్పిందట.వీటితో పాటూ మరో కారణం కూడా ఉంది. అదేంటంటే 'ఆర్ఎక్స్ 100' సినిమాలో అజయ్ భూపతి పాయల్ తో ఎన్ని రొమాంటిక్ సీన్స్ చేయించాడో, ఎంత ఎక్స్పోజింగ్ చేపించాడో మనం చూసాం.ఇక తన నెక్స్ట్ మూవీ లో కూడా అంతకుమించి ఎక్స్పోజింగ్ ఉంటుందనే విషయం సమంత చెవినపడడంతో అలాంటి ఎక్స్పోజింగ్ సీన్స్ లో నటించడం సమంత కి ఇష్టం లేదు. ఒకవేళ ఆ సినిమాకి ఓకే చెబితే అలాంటి సీన్లలో నటించడానికి ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నటించనని చెప్పేసిందట.ఇక ఆ తర్వాత సిద్ధారర్థ్, శర్వానంద్, అతిథి రావు హైదరి లతో 'మహాసముద్రం' సినిమాని తెరకెక్కించాడు అజయ్ భూపతి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: