నందమూరి నట సింహం
బాలకృష్ణ ప్రస్తుతం
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక భారీ బడ్జెట్
మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ
మూవీ గా రూపొందుతుంది. దానితో ఈ సినిమాకు ఇప్పటి వరకు ఈ
మూవీ యూనిట్ టైటిల్ ను ఖరారు చేయక పోవడంతో ఈ
మూవీ షూటింగ్ ను ఈ చిత్ర బృందం ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది.

ఈ
మూవీ లో
కాజల్ అగర్వాల్ బాలకృష్ణ సరసన
హీరోయిన్ గా నటిస్తోంది. ఈ
మూవీ బాలకృష్ణ మరియు
కాజల్ కాంబినేషన్ లో మొట్ట మొదటి మూవీ. ఈ సినిమాలో
శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ...
తమన్ ఈ
మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది
. తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా లోని ఒక పాట షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నట్టు ... ఈ పాట షూటింగ్ ను చాలా గ్రాండ్ గా తెరకెక్కించినట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక ఫోటోను కూడా విడుదల చేసింది. ఈ
మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో
బాలకృష్ణ తెలంగాణ మాండలికంలో మాట్లాడబోతున్నట్లు ... అలాగే
తెలంగాణ మండలికం లోనే అదిరిపోయే డైలాగ్ లు చెప్పనున్నట్లు ... ఆ డైలాగ్ లు అన్నీ కూడా అదిరిపోయే రేంజ్ లో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ
మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు సమాచారం.