బలమైన కథ, ప్రయోగాత్మక అంశాలతో కూడిన చిత్రాల్లో నటిస్తూ పృథ్వీరాజ్ సుకుమారన్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటున్నారు. కథ కోసం, పాత్ర కోసం ప్రాణం పెట్టే నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్.

ఆ విషయం మరోసారి రుజువైంది. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఆడుజీవితం' అనే చిత్రంలో నటిస్తున్నారు.

నేషనల్ అవార్డు విజేత బ్లేస్సి దర్శకత్వం లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ది గోట్ లైఫ్ పేరుతో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ కోసం చిత్ర యూనిట్ గత పదేళ్లుగా శ్రమిస్తోంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఎడారిలో వలస జీవుల ఆకలి వేదన, బానిస బతుకు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సుకుమారన్ ఎడారిలో పనిచేసే కూలీ గా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం సుకుమారన్ ఎంతలా శ్రమిస్తున్నారో, తన మేకోవర్ ఎలా మార్చుకున్నారో తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఎక్కువ భాగం ఈ చిత్ర షూటింగ్ ఎడారిలోనే సాగుతోంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎడారిలో వలస కార్మికులు ఆహారం, నీళ్లు దొరకక పడే వేదనని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు.

ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సరసన హాట్ బ్యూటీ అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల అమలాపాల్ ఎక్కువగా బోల్డ్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా అమలాపాల్ బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. ట్రైలర్ లో అమలాపాల్, సుకుమారన్ మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఘాటుగా ఉన్నాయి.


ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ డెడికేషన్ ని, ఈ పాత్ర కోసం ఆయన మారి న విధానాన్ని అంతా ప్రశంసిస్తున్నారు. సహారా, అల్జీరియా, జోర్డాన్ ఎడారుల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంకా ఈ చిత్ర షూటింగ్ మిగిలే ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: