నందమూరి బాలకృష్ణ , డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తన 108వ చిత్రానికి సంబంధించి షూటింగ్ జరుగుతోంది.. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించగా.. బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తెలంగాణ యాసలు తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి పలు అప్డేట్లను కూడా చిత్రగురుందా విడుదల చేస్తూనే ఉంది. బాలయ్య ఇందులో చాలా సరికొత్తగా కనిపించబోతున్నారు.


ఈ ఏడాది దసరాబరిలో ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉంది . హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వేసిన భారీ సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించి విలన్ ఎవరనే విషయంపై చాలా అద్భుతంగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజున తాజాగా అందుకు సంబంధించి అప్డేట్ కూడా విడుదల చేయడం జరిగింది.. బాలీవుడ్ నటుడు నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ విచిత్రంలో నటిస్తున్నారు ఇదే మొదటిసారి ఈయన తెలుగులో నటిస్తున్న సినిమా.


ఇప్పుడు రాంపాల్ NBK -108 షూటింగ్ చెట్లు అడుగుపెట్టినట్లుగా ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. వెల్కమ్ అబోర్డు బాలీవుడ్ యాక్షన్ నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ రాంపల్ అంటూ ఒక చిన్న బిట్ ని వీడియో విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మెట్లపై కూర్చుని ఉంటారు. అర్జున్ రాంపాల్ మెట్లు దిగుతూ వచ్చి అనిల్ రావుపూడి పక్కన కూర్చుంటారు. బాలయ్య బాబు డైలాగ్ చెబుతారు.. బాలీవుడ్ నటుడు రాంపాల్ పవన్ కళ్యాణ్ కృషి కాంబినేషన్లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా ద్వారా పరిచయం కావలసి ఉండగా షెడ్యూల్ కుదరకపోవడం వల్ల ఈ సినిమా నుంచి అర్జున్ రాంపాల్ తప్పుకున్నట్లు సమాచారం. పవన్ తో మిస్సయిన సినిమా బాలయ్యతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు రాంపాల్..

మరింత సమాచారం తెలుసుకోండి: