టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ తాజాగా 'రావణాసుర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారీ అంచనా నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్లాప్ అందుకుంది. ఇక ప్రస్తుతం 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమాలో నటిస్తున్నాడు రవితేజ.పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా రవితేజకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 

రీసెంట్గా రావణాసురతో భారీ ప్లాప్ అందుకున్న రవితేజ తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసి నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడట. ఇంతకుముందు వరకు ఒక్క సినిమాకు 15 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే రవితేజ.. ఇప్పుడు ఏకంగా 25 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ఇటీవల కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ తో ఓ సినిమాను ఓకే చేశాడు రవితేజ. అయితే ఈ సినిమా కోసం ఏకంగా 25 కోట్లు రెమ్యునరేషన్ అడిగినట్లు తెలుస్తోంది. ఆయన డిమాండ్ కి ముందు నిర్మాతలు షాక్ అయినా.. ఆ తర్వాత అంత మొత్తం ఇచ్చేందుకు ఒప్పుకున్నారని ఫిలిం సర్కిల్స్లో టాక్ నడుస్తోంది.

ఇప్పుడున్న యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు 25 నుంచి 50 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వాళ్లకంటే కాస్త సీనియర్ అయిన రవితేజ ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది. రీసెంట్ గా రవితేజ నటించిన రావణాసుర డిజాస్టర్ అయినా కూడా ఈ హీరో రెమ్యూనరేషన్ మాత్రం భారీగా పెంచడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ పూర్తి చేసిన రవితేజ తన తదుపరి సినిమా 'ఈగల్' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: