అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన టాలెంటెడ్ హీరోల లో సుమంత్ ఒకరనే విషయం తెలిసిందే. సుమంత్ కెరీర్ ప్రారంభం లో నటించిన సినిమాల లో మెజారిటీ సినిమాలు విజయం సాధించాయి.

హీరో సుమంత్ రిజెక్ట్ చేసిన సినిమాల లో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ స్టేటస్ ను కూడా సొంతం చేసుకున్నాయి. అయితే గత కొన్నేళ్లలో సుమంత్ హీరోగా నటించిన మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అయితే సొంతం చేసుకున్నాయి.

మళ్లీ రావా  సినిమా తో విజయం సాధించినా ఆ సినిమా సుమంత్ కెరీర్ కు పెద్దగా ప్లస్ కాలేదు. అయితే సుమంత్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సీతారామం మరియు సార్ సినిమాల లో సుమంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించగా ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అయితే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఈగల్ సినిమా లో నటించడానికి సుమంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అయితే తెలుస్తోంది.

ఈ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్ర లో సుమంత్ కనిపిస్తారని తెలుస్తుంది.. అయితే ఎంతో ప్రతిభ ఉన్న సుమంత్ స్పెషల్ రోల్ లో నటించడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట.. సుమంత్ హీరో గానే కెరీర్ ను కొనసాగించి ఉంటే బాగుండేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.. సుమంత్ పారితోషికం కూడా పరిమితం గా ఉందని తెలుస్తోంది.

అక్కినేని హీరోల సినిమాల లో కూడా సుమంత్ నటిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుమంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాలన్నీ కూడా సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో ఆయనకు సినిమా ఆఫర్లు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. సుమంత్ క్లాస్ సినిమాలలోనే ఎక్కువగా నటించడం ఆయనకు ఒకింత మైనస్ అయిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారట.. సుమంత్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: