త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు రాంచరణ్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా రాబోతోంది. కాగా ఈ సినిమాలో కీయారా ఆద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్ .ఇక ఈ సినిమా రూరల్ యాక్షన్ రామ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోని ఆస్కార్ అవార్డ్స్ ప్రమోషన్స్ లో రామ్ చరణ్ తో పలు హాలీవుడ్ సంస్థలు కూడా సంప్రదింపులో జరిపారట. ఇక ఆ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ వెల్లడించాడు.

దీంతో రామ్ చరణ్ పాన్ వరల్డ్ హీరోగా ఎదగడం ఆయన ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. త్వరలోనే హాలీవుడ్ ప్రాజెక్టులు కూడా అనౌన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇలాంటి ప్రకటన చేయలేదు రామ్ చరణ్ ఈ క్రమంలోనే కార్తికేయ 2 ఫిలిం చందు మొండేటి రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలపై కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ కార్తికేయ 2 కంటే ముందే గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేసేందుకు రెడీగా ఉన్నానని త్వరలోనే దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుందని అన్నారు.

ఇక అందులో హీరోగా రామ్ చరణ్ నటించ బోతున్నట్లుగా చందు ప్రకటించాడు. అంతేకాదు సుమారు 300 కోట్లకు పైగా అనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా ఉండబోతుందని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం చందు  చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక గీత బ్యానర్లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మళ్ళీ ఇప్పుడు అదే బ్యానర్ లో రాంచరణ్ భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు మెగా ఫ్యాన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: