తెలుగు వెండి తెరపైకి కొత్త స్టార్ కిడ్ వచ్చాడు. దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు అయిన అభిరామ్ 'అహింస' సినిమాతో అరంగేట్రం చేశాడు. కొత్త వాళ్లను పరిచయం చేయడంలో తనదైన మార్క్ చూపించే సీనియర్ దర్శకుడు తేజ రూపొందించిన చిత్రమిది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం.తేజ చేసిన 'చిత్రం'.. ఒక 'నువ్వు నేను'.. ఒక 'జయం'.. ఈ మూడు చిత్రాలు రెండు దశాబ్దాల కిందట యవ్వనంలో ఉన్న ప్రేక్షకులను మామూలుగా ఊపేయలేదు. హీరో హీరోయిన్లెవరో కూడా చూడకుండా.. కేవలం 'తేజ' అనే బ్రాండ్ మాత్రమే చూసి థియేటర్లకు పరుగులు పెట్టేలా చేసిన చిత్రాలివి. అలాంటి సూపర్ ఫాలోయింగ్ సంపాదించిన అరుదైన దర్శకుల్లో ఒకరు తేజ. కానీ పై మూడు చిత్రాలతో ట్రెండ్ సెట్ చేసిన తేజ ఇక తర్వాత ఆ ట్రెండులోనే చిక్కుకుపోవడమే అతనికి ఇప్పుడు మైనస్ అయ్యింది.


ముందు తీసిన సినిమాలు కొత్తగా అనిపించి ప్రేక్షకులను మెప్పించాయి కదా అని ఇక అవే పట్టుకొని తీస్తూ ఉంటే బోర్ కొట్టడం ఖాయం. ఇప్పుడు తేజ విషయంలో కూడా అదే జరిగింది. ఇక తర్వాతి కాలంలో ఆయన ప్రేమకథ తీశాడంటే చాలు.. వామ్మో అనుకునే పరిస్థితి రానే వచ్చింది. అన్ని ఎదురు దెబ్బలని తిన్న తర్వాత కూడా మళ్లీ ఇప్పుడు తన 'మార్కు'.. పాత చింతకాయ పచ్చడి ప్రేమకథనే మళ్లీ వడ్డించాడు 'అహింస' సినిమాతో. సినిమా మొదలైన దగ్గర్నుంచి 'ఔట్ డేటెడ్' ఫీల్ వాసన కొట్టే ఈ సినిమా.. ప్రేక్షకులకు మాత్రం పెద్ద హింసలాగే తయారైంది.దగ్గుబాటి లాంటి పెద్ద ఫ్యామిలీ నుంచి కొత్తగా హీరో అవుతున్న అభిరాంను పెట్టి తేజ ఇలాంటి సినిమా చేయడం ఇంకా ఇది కాకుండా ఎంతో అనుభవజ్ఞుడైన సురేష్ బాబు లాంటి నిర్మాత దీనికి పెట్టుబడి పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయాలు.అయితే ట్రైలర్ చూసినపుడే ఔట్ టేడ్ ఫీల్ కలిగినా.. సినిమాలో తేజ ఏమైనా మ్యాజిక్ చేసి ఉంటాడేమో అనుకుంటే అసలు ఏమి లేకుండా అతి సాధారణంగా ముగుస్తుంది 'అహింస'.

మరింత సమాచారం తెలుసుకోండి: