దివి అసలు పేరు దివ్య వైద్య. ఎంబీఏ చదివింది.. యాక్టర్‌గా రాణిద్దామని అనుకుంటున్న దివి ఇంట్లో ఇద్దరు డాక్టర్లున్నారు. దివి అమ్మ, అన్నయ్య ఇద్దరూ డాక్టర్సే. దివికి సినిమాల్లోకి రావాలని చాలా కోరిక. దానికి తొలుత మోడలింగ్‌ను ఎంచుకుంది. చిన్న చిన్న యాడ్స్‌లో నటించింది. ఆ సమయంలోనే ‘మహర్షి’ సినిమాలో నటించే అవకాశం సంపాదించింది. సినిమాలో కాలేజీ స్టూడెంట్ పాత్ర కోసం ఆడిషన్స్ జరిగితే వెళ్లి ట్రై చేసింది. డైరెక్టర్ వంశీపైడిపల్లికి దివి నటన నచ్చి సినిమాలో అవకాశం ఇచ్చాడు. అందులోని కాలేజీ ఎపిసోడ్ మహేశ్‌బాబుతో కలిసి నటించే ఛాన్స్ అలా కొట్టేసింది. ఆ తర్వాత వెబ్ సిరీస్‌ల్లోనూ నటించింది.