బాలు ఆస్పత్రి బిల్లు ఎంత? ఎవరు కట్టారు? అని చర్చ మొదలైంది. తన తండ్రి ఆస్పత్రి బిల్లుల విషయంలో ప్రచారంలో వున్న వార్తలేవీ వాస్తవాలు కావనీ, అదంతా తప్పుడు ప్రచారమే అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. సదరు వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో తనకు తెలియదనీ, నిజమైన బాలు అభిమానులు ఎవరూ ఇలా చేయరని ఆయన అన్నారు. ఆస్పత్రి బిల్లు ఎంత అయ్యింది? ఎవరు ఎంత చెల్లించారు? వంటి వివరాలు త్వరలో ఎంజిఎం ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి విడుదల చేస్తానని చరణ్ తెలిపారు.