తాజాగా రకుల్ తన 30 వ పుట్టిన రోజును జరుపుకుంది. ఈ సందర్బంగా ఆమెకు ప్రముఖులు మరియు తన స్నేహితులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అందరి విషెస్ కన్నా క్రిష్ చేసిన ట్వీట్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. షూటింగ్ సెట్ లో ప్రతి రోజు మిమ్ములను చూస్తూ ఉంటే మీపై ఉన్న గౌరవం రెట్టింపు అవుతుంది. వర్క్ పట్ల మీ అంకితభావం మరియు ప్రతిభ క్రమశిక్షణతో నాకు మీపై ఉన్న అభిమానం పెరుగుతూనే ఉంది.