హాట్ బ్యూటీ పూజ హెగ్దే మాత్రం పారితోషికం తగ్గించుకునే విషయంలో ససేమిరా అందట. ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాలో నటిస్తుంది. ఇటీవల ఈ బుట్టబొమ్మను ఓ ప్రాజెక్టు కోసం దర్శక నిర్మాతలు సంప్రదిస్తే.. ఏకంగా రూ2.5 కోట్ల పారితోషికం చెప్పిందట. దాంతో వారు వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మరో ముద్దు గుమ్మ కూడా పూజ బాటలోనే నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు. క్యూట్ అండ్ హాట్ బ్యూటీ రష్మిక మందన. వివరాల్లోకి వెళితే.. శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కుతున్న `ఆడాళ్లూ మీకు జోహార్లూ` చిత్రం కోసం రష్మిక ఏకంగా 1.75 కోట్ల పారితోషికం అందుకుంటుందట. నిజానికి ఆమె 2కోట్లు డిమాండ్ చేసిందట.. తరువాత దర్శకనిర్మాతల భేరసారాల తరువాత రూ.1.75 కోట్లకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.