అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు. అందరూ సురక్షితంగా, సంతోషంగా ఈ పండగను జరుపుకోండి. బాగా ఎంజాయ్ చేయండి. క్రాకర్స్ మొత్తానికే కాల్చొద్దని నేను చెప్పను కానీ.. ఎంతవరకు కుదిరితే అంతవరకు క్రాకర్స్ కాల్చడం తగ్గించండి. అది మానడం కష్టమే. ఎందుకంటే మన సంప్రదాయం ప్రకారం దీపావళి రోజున క్రాకర్స్ కాల్చడం, దీపాల వెలుగులో ఆనందంగా గడపడం అనేది ఎప్పటినుంచో వస్తోంది. కాకపోతే కాకర్స్ విషయంలో కంట్రోల్లో ఉంటే బెటర్. శబ్ద కాలుష్యం, వాతావరణ కాలుష్యాన్ని కొంతైనా తగ్గించండి.. అంటూ విజ్ఞప్తి చేస్తూనే దీపావళి సంబరాలు కుటుంబంతో చేసుకోండి అని రేణు దేశాయ్ వీడియో ను పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..