దీపావళి సందర్భంగా పరశురామ్‌కు మహేష్ విషెస్‌తోపాటు బహుమతులు కూడా పంపించాడు. వాటిని పరుశురామ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. `మా సూపర్‌స్టార్ మహేష్ బాబు నుంచి అందమైన కానుక. ఈ దీపావళిని నా జీవితంలోనే ప్రత్యేకమైనదిగా మార్చినందుకు ధన్యవాదాలు సర్. మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు` అని పరశురామ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..