యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘టెంపర్’ సినిమాలో కీలక పాత్రలో నటించింది. అందం, అభినయం కలబోసిన మధురిమకు టాలీవుడ్లో పెద్దగా లక్ కలిసిరాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది.‘ఆ ఒక్కడు’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మధురిమ ఆ తర్వాత... మౌనగారం, సరదాగా కాసేపు, ఆరెంజ్, మహంకాళి, షాడో చిత్రాల్లో నటించింది. కొత్తజంట, దోచేయ్ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఈమె అసలు పేరు నైరా బెనర్జీ.. బెంగాలీకి చెందింది. తెలుగులో సినిమా అవకాశాల కోసం తన పేరుని మధురిమ గా మార్చుకుంది.  ఇక పోతే తెలుగులో ఛాన్స్ లు రాక బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడ నిలదొక్కుకోడానికి బాగా గ్లామర్ షో చేస్తుంది ఈ హాట్ బ్యూటీ. ఎంతలా అంటే యూత్ పడి చచ్చిపోయేలా స్కిన్ షో ప్రదర్శిస్తుంది. ఇక అక్కడ కూడా ఐటెమ్ గర్ల్స్ తరహాలో గ్లామర్ షో చూపిస్తున్నా కాలం కలిసిరావడం లేదు. దీంతో బికినీలతో కుర్రకారును రెచ్చగొట్టేలా ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తోంది. వీటిలో చాన్సులు రాకపోయినా లైకులు, కామెంట్లు మాత్రం బాగానే వస్తున్నాయి.