హారిక ఆడిన గేమ్ కి పాజిటివ్ గా స్పందిస్తున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ. హారిక నువ్వు చేసింది చాలా సరైన పని. అభిజిత్ ని నామినేషన్ నుంచి సేవ్ చేసి నీ ఫ్రెండ్షిప్ ఏంటో నిరూపించుకున్నావ్. ఇన్నాళ్లు నిన్ను అభి కాపాడాడు ఇప్పుడు నువ్వు అభి రుణం తీర్చుకున్నావ్ అంటూ హారిక పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నీకెప్పుడు అభి ఫ్యాన్స్ బిగ్ బాస్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది. అని హారికకి మద్దతుగా బిగ్ బాస్ ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఇక్కడ హారిక తీస్కున్న డెసీషన్ లో ఎలాంటి తప్పు లేదనిపించింది. అంతేకాదు, చాలామంది నెటిజన్స్ కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు.