నాగ సౌర్య మొదట్లో లవర్ బాయ్ గా మంచి మంచి సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు. తరువాత అదే రీతిలో కాకుండా చాలా డిఫరెంట్ గా మూవీస్ చేస్తున్నాడు. ఇప్పుడు సంతోష్ జాగర్లపూడి తో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘లక్ష్య’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సోమవారం స్పెషల్ పోస్టర్ను విడుదలచేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్లో నాగశౌర్య లుక్ ఆకట్టుకుంటోంది.