రకుల్ ప్రీత్ సింగ్ కాలేజీ రోజులో చేసిన పనిని సమంత గుర్తు చేసి బయట పెట్టింది. ఈ హాట్ బ్యూటీ అప్పుడు కాలేజీ రోజుల్లోనే స్కూటీ రైడ్స్‌కి ఛార్జ్ చేసేదని సమంత రివీల్ చేసింది. ఈ విషయం చాలా మందికి తెలీదని.. నీకు ఎలా తెలుసు అంటూ సమంతను అడిగింది రకుల్. రకుల్ కాస్త బోల్డ్‌గా మాట్లాడుతుంటే.. ‘‘నో రకుల్, ఇది ఫ్యామిలీ షో’’ అంటూ సమంత నవ్వుతూ అనింది. దీనికి రకుల్.. ‘‘నాకు తెలుసు. కానీ, నాకు సిగ్గులేదు. నేను ఒక సైకో అని నాకు తెలుసు’’ అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది.