నటి రష్మీ అనే కంటే జబర్దస్త్ రష్మీ అంటే... అందరికీ వెంటనే కనెక్ట్ అవుతుంది. అంతగా ఈ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ. గతంలో ఎన్నో టీవీ షోలలోనూ, సినిమాలలోనూ రష్మీ నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కానీ జబర్దస్త్ షో ఎంట్రీ ఇచ్చాక రష్మీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పొట్టి పొట్టి బట్టల్లో... వచ్చీరాని అందమైన తెలుగుతో ఈ అమ్మడు ప్రేక్షకులను ఫిదా చేసింది.