ఒకప్పుడు సినిమాలపై మాత్రమే విమర్శలు కురిపించే ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు రాజకీయాలపై కూడా కన్నేసింది. మొన్నామధ్య జరిగిన ప్రెస్ మీట్ అనంతరం ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందిస్తూ.. 'ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారో రారో నాకు తెలియదు. కానీ వస్తే మాత్రం పక్కా సీఎం అవుతారు.తెలుగు ప్రజలు ఆయనను వాళ్ళ ఇంట్లో సొంత కొడుకులా, అన్నలా చూస్తారు' అంటూ ఆయన కామెంట్స్ చేసిన వీడియోలను షేర్ చేసింది.ఎన్టీఆర్పై ప్రశంసల వర్షం కురిపిస్తూ వరుస పోస్టులు పెట్టింది శ్రీరెడ్డి. దీంతో ఆమె యంగ్ టైగర్ అభిమాని అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి సమయంలోనే తన ఫేస్బుక్ ఖాతాలో ఊహించని విధంగా కామెంట్లు చేస్తూ పోస్టు పెట్టింది.