ఈ వారంలోనే సుల్తాన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు తమిళ హీరో కార్తీక్. ఈ హీరో తన అన్న సూర్య లాగే అటు తమిళంలో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం కార్తీక్ నటిస్తున్న తాజా చిత్రం సుల్తాన్. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తోంది. దర్శకుడు భాగ్యరాజ ఖన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇది సినిమాపై మరింత హైప్ ను పెంచింది.