ఇటీవల వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా అంటే రెండు కోట్లు ఖర్చు పెట్టి, గ్రాండ్ గా చేద్దామని అనుకున్నాడు దిల్ రాజు . అంటే ఏప్రిల్ మూడవ తేదీన వకీల్ సాబ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో భారీగా జరిపించాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ హైదరాబాద్ పోలీసులు వకీల్ సాబ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఓపెన్ గ్రౌండ్లో భారీ ఎత్తున చేయడానికి ఒప్పుకోలేదు.అందుకే ఆదివారం జరగాల్సిన వకీల్ సాబ్ ఈవెంట్ క్యాన్సల్ అవడంతో, దిల్ రాజుకు రెండు కోట్ల రూపాయలు మిగిలాయి. అయితే వకీల్ సాబ్ రిలీజ్ ఈవెంట్ ను ఎటువంటి హంగామా లేకుండా హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ రోజు అంటే ఏప్రిల్ 4వ తేదీన ఈవెంట్ జరగబోతోంది..