వర్మ ఇప్పుడు సరికొత్తగా రిలీజ్ చేసిన ట్రైలర్ "డేంజరస్". ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఇద్దరు లెస్బియన్ల మధ్య నడిచే కథ ఇది. ఇందులో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రలు పోషించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా లాంచ్ చేశాడు వర్మ. చూసినవారంతా వర్మ పై మరిన్ని విమర్శలు చేస్తున్నారు. బీ గ్రేడ్ సినిమాలకు మించి ఈ సినిమా ట్రైలర్ ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. తను తీసే సినిమాలలో హీరోయిన్లను ఎంతో స్పెషల్ గా చూపించే వర్మ. ఈ మధ్యకాలంలో కేవలం వారి అందాల పైన దృష్టి పెట్టబోతున్నాడని ఇవన్నీ చాలా చీప్ గా ఉన్నాయి అని నెటిజన్లు విమర్శిస్తున్నారు