ఢీ డాన్స్ షో లో స్టార్ డాన్సర్ గా బాగా పాపులారిటీని సంపాదించుకున్న అక్సా ఖాన్, ప్రస్తుతం తన టాలెంట్ తో కన్నా వార్తలతోనేఎక్కువగా సెలబ్రిటీ స్టేటస్ ను తెచ్చుకోవాలని చూస్తున్నట్లు నెటిజనులు కామెంట్ లు కూడా పెడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఇక ఇప్పటికే అక్సాఖాన్ సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం నడుపుతోందనే పుకార్లు గుప్పుమంటున్నాయి.ఈ అమ్మాయి తనకు సుడిగాలి సుధీర్ అంటే ఎంతో అభిమానం ఉందని, ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కానీ తన ప్రపోజల్ ను సుధీర్ సున్నితంగా తిరస్కరించారని ,అతడి సన్నిహితులు కూడా చెబుతున్నారు. కానీ సుధీర్ అక్సాఖాన్ తో "నీ కెరియర్ పైన దృష్టి పెట్టమని" సూచించారట.