ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయాన్ని సాధించి రికార్డు బద్దలు కొట్టిన కేజిఎఫ్ చిత్రంలో హీరో యశ్ తో సహా కొందరు ప్రముఖ పాత్రలపై కూడా తెలుగు ప్రేక్షకులు అశేష ఆదరణ చూపించారు. ఈ చిత్రంలో తన భారీ ఆకారంతో నెగిటివ్ షేడ్ ను చూపించిన విలన్ రామ్ అలియాస్ గరుడ రామ్ మలయాళంలోనే కాక టాలీవుడ్ ఇండస్ట్రీ లోనూ గుర్తింపు పొంది వరుస అవకాశాలు అందుకుంటున్నారు.