శ్రీనివాస్ రెడ్డి, పూర్ణల నటన , సినిమాటోగ్రఫీ , సాంగ్స్శ్రీనివాస్ రెడ్డి, పూర్ణల నటన , సినిమాటోగ్రఫీ , సాంగ్స్అక్కడక్కడ కాస్త స్లో అనిపించడం, ఎడిటింగ్

కరీంనగర్ లో ఉంటున్న సర్వమంగలం (శ్రీనివాస్ రెడ్డి) ఉద్యోగ రీత్యా కాకినాడకు రావాల్సి ఉంటుంది. మంచి మనసున్న సర్వమంగలం రాణి (పూర్ణ)ను చూడగానే ఇష్టపడతాడు. తను చేసే ప్రతి పనిలోనూ పితాజి (జీవా) ప్రమేయంతో చేసే సర్వమంగలం తను ప్రేమించే అమ్మాయి తను పనిచేసే చోటే ఉంటుందని గమనించి ఆమెతో పరిచయం పెంచుకోవాలని చూస్తాడు. ప్రతి విషయంలోనూ తన పక్కన వారి సహాయం తీసుకునే సర్వమంగలం రాణి వల్ల అనుకోని పరిస్థితుల్లో తన పితాజీ మాట కాదని మనసు మాట విని నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు సర్వమంగలం ఎందుకు అలా మారాడు..? రాణి ప్రేమను సర్వమంగలం దక్కించుకున్నాడా..? అన్నది అసలు కథ.  

కమెడియన్ గా ఉంటూ గీతాంజలిలో లీడ్ రోల్ చేసిన శ్రీనివాస్ రెడ్డి పూర్తి స్థాయి హీరోగా చేసిన సినిమా జయమ్ము నిశ్చయమ్మురా. తన ఇమేజ్ కు తగ్గ క్యారక్టర్ తో అటు అమాయకంగా ఉంటూనే తన మార్క్ కామెడీని పండించాడు శ్రీనివాస్ రెడ్డి. సినిమా మొత్తం తన భుజాల మీద వేసుకుని చేశాడు. ఇక హీరోయిన్ పూర్ణ కూడా బాగా నటించింది. చాలా వరకు పూర్ణ తన నటనా ప్రతిభ చూపించడానికి స్కోప్ దొరికిందని చెప్పొచ్చు. కమెడియన్స్ కృష్ణ భగవాన్, ప్రవీణ్, పోసాని కృష్ణ మురళి జోగి బ్రదర్స్ అంతా సినిమాలో ఎంటర్టైనింగ్ తో నింపేశారు. రవి వర్మ కూడా విలనీగా బాగా చేశాడు.

ఓ దర్శకుడిగా మంచి అభిరుచి కనబరిచాడు శివ రాజ్ కనుమూరి. నవల ఆధారంగా రాసుకున్న కథ అంటూ ముందే చెబుతూ దాన్ని తెర మీదకు అంతే చక్కగా చూపించాడు. అయితే కథనం కాస్త నెమ్మగించిందని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మ్యూజిక్ సినిమాకు చాలా క్రేజ్ తెచ్చి పెట్టింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కెమెరామన్ పనితనం బాగుంది. కాకినాడ, భీమిలి లొకేషన్స్ అందంగా చూపించారు. అయితే ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నా ఇంకాస్త ట్రిం చేసి స్పీడ్ గా లాగించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ చాలా చిన్నదే. ప్రతిసారి ఏదో ఒక విధంగా తన పక్కన వారి మీద ఆధారపడే కుర్రాడు తన జీవితంలో తనకు తానుగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అన్నదే జయమ్ము నిశ్చయమ్మురా. సినిమా ముందునుండి దర్శకుడి పనితనం కనిపిస్తుంది. ప్రతి సీన్ లో సినిమా అందంగా చూపించాలని చూశారు.

ఇక తను అనుకున్న కథకు క్యారక్టర్స్ ను ఎన్నుకోవడంలో సగం సక్సెస్ అయిన దర్శకుడు ఇక అదే ఫీల్ తెర మీద కనిపించేలా చేసినందుకు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సినిమా కథ కొత్తగా అనేది పక్కనపెడితే ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇక సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ మోడ్ లో నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలోనే అసలు పాయింట్ కాస్త డైవర్ట్ అయినట్టు అనిపిస్తుంది.

ఇక మొదటి భాగంతో పాటుగా రెండో భాగంలో కూడా అక్కడక్కడ కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. కథనం ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది. శ్రీనివాస్ రెడ్డి, పూర్ణల నటన హైలెట్ అని చెప్పొచ్చు. రాసుకున్న కథకు ఈ ఇద్దరు మాత్రమే పర్ఫెక్ట్ అనిపించేలా చేశారు. ముఖ్యంగా డైలాగుల విషయంలో కూడా దర్శకుడి ప్రతిభ కనిపించింది. సరదాగా వెళ్లి సినిమా చూసొద్దాం అనుకునే వారికి జయమ్ము నిశ్చయమ్మురా తప్పక నచ్చుతుంది.


Srinivas Reddy,Poorna,Shiva Raj Kanumuri,Ravichandraజయమ్ము నిశ్చయమ్మురా.. ఓ సారి చూసేయొచ్చురా..!

మరింత సమాచారం తెలుసుకోండి: