ఈ మధ్య రీమిక్స్ గీతాల పరంపర కొనసాగుతోంది. తాజాగా ‘నాయక్’లోని ‘శుభలేక రాసుకున్న’ రీమిక్స్ గీతం అభిమానుల మనసుల్ని దోచుకుంటోంది. ఇంతకుముందు మగధీర, రచ్చల్లో కూడా ఒక్కో గీతాన్ని రీమిక్స్ చేశారు. అల్లరి నరేష్ చిత్రాల్లో కూడా ఈ మధ్య ఒక్కో పాటని రీమిక్స్ చేసి వాడుకున్నారు. అయితే, ఒకే సినిమా నుంచి రెండు గీతాలను తీసుకుని రీమిక్స్ చేయడం ఇంతవరకూ జరగలేదు.
ఇప్పుడు జరుగుతోంది. ‘హలో బ్రదర్’ చిత్రంలోని ‘ప్రియరాగాలే’, ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో’ పాటలు ఎంత హిట్లో అందరికీ తెలిసిందే. ఆపాటలు ఇప్పటికీ వినాలనిపిస్తూనే ఉంటాయి. ఈ రెండుగీతాలనూ తన తరువాతి చిత్రంలో రీమిక్స్ చేసి ఉపయోగించబోతున్నారు దర్శకుడు శ్రీనివాసరెడ్డి.
‘ఢమరుకం’ హిట్టుతో మంచి ఊపు మీద ఉన్న శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం నాగచైతన్య ద్విపాత్రాభినయంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రంలో ఈ రెండు గీతాలూ చోటు చేసుకుంటాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: