సిద్ధార్థ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘జబర్థస్త్’. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక శుక్రవారం రాత్రి అన్నపూర్ణా స్టూడియో లో జరిగింది. ముఖ్యఅతిధిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు వినాయక్ చిత్ర ఆడియోను విడుదల చేసి, తొలి సీడిలను సునీల్, శ్రీహరి లకు అందచేశారు. ఈ సందర్భంగా జబర్థస్త్ నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ‘’అలామొదలయ్యింది’తో తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న నందిని రెడ్డి ఈ ‘జబర్థస్త్’ను అద్భుతంగా తీర్చిదిద్దిందని’ తెలిపారు. దగ్గుబాటిరానా మాట్లాడుతూ‘జబర్థస్త్ సినిమా విజయవంతం కావాలని’ ఆకాక్షించారు. ‘క్షణక్షణం’ లో నటన చూసి శ్రీదేవి అభిమానిగా మారానని, తరువాత మళ్లీ ‘ఏం మాయ చేశావే’ తో సమంత అభిమాని అయ్యానని రానా తెలిపాడు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో హీరోయిన్లు సిద్ధార్థ, సమంత, దర్శకురాలు నందనిరెడ్డి, సంగీత దర్శకుడు థమన్, నటుడు శ్రీహరి, తాగుబోతు రమేష్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: