మంచు మనోజ్ ఎప్పుడో ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటాడు అనడం కన్నా తమిళ ట్యూన్లను, తమిళ వాతావరణాన్ని తెలుగులో రిఫ్లెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ హీరోని పెళ్ళి చేసుకోమంటే తనకు మంచి హిట్ వస్తేగానీ చేసుకోను అని అంటున్నాడట. ఈ విషయాన్ని మనోజ్ తండ్రి మోహన్ బాబు స్వయంగా వెల్లడించారు. ‘‘జీవితాశయాలు ఎన్నైనా ఉండొచ్చు. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోవడం కూడా జీవితాశయం కావచ్చు. మనోజ్ హిట్ వస్తేగానీ పెళ్ళి చేసుకోనని అంటున్నాడు. హిట్ వస్తే కట్నకానుకలు వస్తాయనుకున్నాడేమో. నాకైతే కట్నకానుకలు అనే పదం వింటేనే అసహ్యం’’ అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు.
మరింత సమాచారం తెలుసుకోండి: