మంచుమనోజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘ఊకొడతారా.. ఉల్కిపడతారా..’ సినిమా సొమవారం నాడు సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. మనోజ్ కుమార్ కెరీర్ లో అత్యంత భారీగా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నటుడు బాలకృష్ణ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించడం ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచుతుంది. అలాగే, ఈ చిత్రం ట్రైలయర్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఊకొడతారా.. ఉల్కిపడతారా..’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: