కొంత మంది ఒక రంగంలో పనిచేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటే, మరికొంత మంది పని చేసిన రంగానికే పేరు ప్రఖ్యాతలు తీసుకుని వస్తారు. అలా డబ్బింగ్ విభాగానికి పేరు తీసుకుని వచ్చిన వ్యక్తిగా సాయికుమార్ ను చెప్పుకోవాలి. సాయికుమార్ జులై 27, 1960న విజయనగరంలో జన్మించారు. తండ్రి పి.జె.శర్మ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కావడంతో సాయికుమార్ చెన్నై, బెంగుళూరులలో పెరిగాడు. సాయికుమార్ చిన్నతనం నుంచే సినిమాల్లో నటించడం, డబ్బింగ్ చెప్పడం ప్రారంభించాడు. తరువాత సాయికుమార్ ఎందరో అగ్రహీరోలకు డబ్బింగ్ చెప్పాడు. సాయికుమార్ డబ్బింగ్ తో ఆయా హీరోల చిత్రాలకు ప్రత్యేక ఆకర్షణ వచ్చేదంటే అతిశయోక్తి కాదు. రజనీకాంత్, ముమ్మటి, సుమన్, రాశేఖర్ వంటి చాలా మంది హీరోలకు డబ్బింగ్ చెప్పాడు. తరువాత సాయికుమార్ హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కన్నడంలో సాయికుమార్ నటించిన పోలీస్ స్టోరీ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళ బాషల్లో కూడా విడుదలై సాయికుమార్ కు మంచి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది.
సాయికుమార్ కుమారుడు ఆది కూడా యువహీరోగా రాణిస్తున్నాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: